Breaking News

ఆధార్‌ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు :ఉడాయ్‌


Published on: 09 Jul 2025 17:17  IST

బీహార్ రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి ఆధార్‌ను గుర్తింపు పత్రాల జాబితా నుంచి తొలగించడంపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో UIDAI సీఈవో భువనేశ్ కుమార్ స్పందిస్తూ — ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు పత్రం కాదని స్పష్టం చేశారు.ఫేక్ ఆధార్ కార్డులను నిరోధించేందుకు కొత్త క్యూఆర్ స్కానర్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డులపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి అసలైన కార్డుల్ని గుర్తించవచ్చని, ప్రస్తుతం ఈ యాప్ అభివృద్ధి దశలో ఉందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి