Breaking News

ఏపీలో అమానుషం..విద్యార్థినులపై లైంగిక వేధింపులు


Published on: 11 Jul 2025 12:02  IST

రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ, ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి వికృత చేష్టలకి పాల్పడ్డాడు. శరీరాన్ని అసభ్యకరంగా తాకడం, బుగ్గలను నిమరడం వంటి జుగుప్సాకరమైన చేష్టలు చేస్తూ తమకు నరకాన్ని చూపించారని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఏపీ ప్రభుత్వం స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి