Breaking News

ఒకే వేదికపై 54 మంది కవలలు


Published on: 14 Jul 2025 15:04  IST

ఒకే వేదికపై 54 మంది కవలలు చేరడంతో సందడి నెలకొంది. కాకినాడలోని సూర్యకళా మందిరంలో వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల కవలల సమ్మేళనం అందుకు వేదికైంది. ఇందులో కవలలకు వివిధ కేటగిరీలుగా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్యఅతిథిగా వాసవీ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ప్రెసిడెంట్‌ ఎరుకుల రామకృష్ణ హాజరయ్యారు. క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి