Breaking News

ఘోర ప్రమాదం..లారీని వెనక నుంచి ఢీకొన్న కారు


Published on: 18 Jul 2025 14:08  IST

జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్ ఔటర్ రింగ్‌ రోడ్డుపై లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద అంబర్‌పేట్ నుంచి బోంగులూర్ వైపు వెళ్తుండగా ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి