Breaking News

వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు..


Published on: 21 Jul 2025 14:37  IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తూర్పు-పశ్చిమ ద్రోణి దాదాపుగా13° ఉత్తర అక్షాంశము వెంబడి, మధ్య కర్ణాటక నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుంది. జూలై 24, 2025 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి