Breaking News

రన్‌వేపై అదుపుతప్పిన ఎయిర్‌ ఇండియా విమానం


Published on: 21 Jul 2025 14:52  IST

ఎయిర్‌ ఇండియాకు చెందిన AI 2744 విమానం సోమవారం తెల్లవారుజామున కొచ్చి నుంచి ముంబైకి వచ్చింది. ఉదయం ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతుండగా.. వర్షం కారణంగా రన్‌వేపై అదుపుతప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేదని వెల్లడించారు. అనంతరం విమానాన్ని తనిఖీ కోసం తరలించినట్లు పేర్కొన్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి