Breaking News

అదృశ్యమైన విమానం.


Published on: 24 Jul 2025 12:05  IST

రష్యాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అంగారా ఎయిర్‌లైన్స్‌ ఏఎన్-24 విమానం అదృశ్యమైంది. 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం.. ఉన్నట్టుండి ATCతో సంబంధాలు కోల్పోయింది. చైనా బోర్డ‌ర్ స‌మీపంలో అముర్ ప్రాంతంలోని టిండా ప‌ట్ట‌ణం దిశ‌గా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విమానం అదృశ్యమవడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. విమానం ఎక్కడ ఉంది, ఇలా జరగడానికి వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి