Breaking News

కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు


Published on: 29 Aug 2025 16:41  IST

బిహార్‌లోని దర్బంగా లో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం అట్టుడికింది. పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు శుక్రవారం నాడు నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పార్టీ జెండా కర్రాలతో ఉభయ వర్గాలు తలపడ్డాయి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ప్రధానమంత్రి తల్లిని అవమాన పరిచిన కాంగ్రెస్‌కు తాము గట్టి సమాధానం చెబుతామని బీజేపీ నేత నితిన్ నబీన్ తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి