Breaking News

తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం


Published on: 01 Sep 2025 14:36  IST

తెలంగాణ శాసనమండలి ఇవాళ(సోమవారం) ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ సభ్యుల గందరగోళం నడుమ నాలుగు బిల్లులను మండలి ఆమోదించింది. మొదటగా బీసీ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టసవరణ, పురపాలక సంఘాల చట్టసవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యనే మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి.

Follow us on , &

ఇవీ చదవండి