Breaking News

మందుబాబులకు బ్యాడ్ న్యూస్..


Published on: 03 Sep 2025 17:13  IST

గణేశ్ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి.. 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులు, బార్లు, మద్యం అందించే రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే స్టార్ హోటల్స్‌, లైసెన్స్ కలిగిన క్లబ్‌లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి