Breaking News

ప్రధాని, ఆర్మీ చీఫ్‌ మధ్య వైరం అంటూ ఫేక్‌ ప్రచారం


Published on: 09 Sep 2025 13:02  IST

పెద్దఎత్తున ఫేక్‌ ప్రచారానికి తెరలేపిన పాకిస్థాన్‌.. సామాజిక మాధ్యమాల వేదికగా భారత్‌పై విషం చిమ్ముతోంది. భారత ప్రధాని నరేంద్రమోదీ, భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదిల మధ్య చెడిందంటూ ఓ కల్పిత ప్రచారానికి పాక్‌ తెరతీసింది. ఒకేతరహా సందేశం వేర్వేరు అకౌంట్ల నుంచి రావడంతో పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం అప్రమత్తమైంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేసింది. ఇలాంటి అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలంటూ పౌరులకు సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి