Breaking News

బర్త్‌డే గిఫ్ట్.. కదంబ్ మొక్కను నాటిన ప్రధాని మోదీ


Published on: 19 Sep 2025 12:43  IST

బర్త్ డే గిఫ్ట్‌గా వచ్చిన కదంబ్ మొక్కను స్వయంగా నాటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. UK రాజు చార్లెస్ III ప్రత్యేక బహుమతిగా ఇచ్చిన ఈ కదంబ్ మొక్కను 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో ప్రధాని నాటారు. రెండు దేశాల మధ్య స్నేహం, పర్యావరణ పరిరక్షణ పట్ల ఉమ్మడి నిబద్ధతను ఈ మొక్క సూచిస్తోంది.సెప్టెంబర్ 17 బుధవారం 75వ పుట్టినరోజు జరుపుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కింగ్ చార్లెస్ ఈ మొక్కను బహుమతిగా అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి