Breaking News

సీఐడీ పోలీసుల అదుపులో మదనపల్లె పూర్వ ఆర్డీవో


Published on: 19 Sep 2025 14:56  IST

మదనపల్లె పూర్వ ఆర్డీవో మురళిని తిరుపతి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దహనం కేసులో మురళికి సుప్రీం కోర్టు నిన్న (గురువారం) బెయిల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (శుక్రవారం) మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని తిరుపతి పద్మావతిపురంలోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. రెవెన్యూ ఫైళ్ల దహనంపై దాదాపు ఆరు గంటల పాటు మురళిని సీఐడీ అధికారులు విచారించారు.

Follow us on , &

ఇవీ చదవండి