Breaking News

బంగాళాఖాతంలో అల్పపీడనం..


Published on: 24 Sep 2025 14:06  IST

ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్ గంగా పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా ప్రభావం చూపనుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 25న ఉత్తర మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 26న బలపడుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం 27వ తేదీన దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మధ్య ప్రాంతాన్ని దాటే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి