Breaking News

ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం ఒమర్ అబ్దుల్లా


Published on: 28 Apr 2025 16:03  IST

పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా జరిగిన దాడికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కత్వా నుంచి కుప్వారా వరకు జరిగిన ఈ ఆందోళనల్లో ప్రతి ఒక్కరు పాల్గొన్నారన్నారు. వీరంతా స్వచ్ఛందంగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

Follow us on , &

ఇవీ చదవండి