Breaking News

కల్లోల కరూర్‌..!


Published on: 29 Sep 2025 11:35  IST

చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. చిరిగిన పార్టీ జెండాలు.. విరిగిన స్తంభాలు.. నలిగిపోయిన మంచినీటి బాటిళ్లు.. తమిళనాట కరూర్‌లోని వేలుచ్చామిపురం ప్రాంతంలో ఆదివారం నెలకొన్న పరిస్థితి ఇది. సినీనటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ పర్యటన సందర్భంగా శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. కరూర్‌ ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్సా విభాగంలో చికిత్స పొందుతున్న కవిన్‌(31) ఆదివారం మధ్యాహ్నం మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి