Breaking News

తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్..


Published on: 07 Oct 2025 14:22  IST

టీవీకే చీఫ్, నటుడు విజయ్ కరూర్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట అంశం సుప్రీంకోర్టుకు చేరింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు అక్టోబర్ 10వ తేదీన సుప్రీంకోర్టులో కేసు విచారణ జరగనున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి