Breaking News

ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ ప్రైజ్


Published on: 07 Oct 2025 15:22  IST

2025 సంవత్సరానికి గాను ఫిజిక్స్‌లో ప్రతిభ చూపిన వారికి ఇవాళ నోబెల్ ప్రైజ్‌లు ప్రకటించారు. అమెరికాకు చెందిన ముగ్గురికి భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారాలు లభించాయి. జాన్‌ క్లార్క్, మైఖేల్ డెవోరెట్, జాన్ ఎం.మార్టినిస్‌ లను ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. క్వాంటమ్ మెకానిక్స్‌ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌లో పరిశోధనలకు గాను వీరికి నోబెల్ పురస్కారం దక్కింది. స్వీడన్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇవాళ (అక్టోబర్ 7)న ఈ అవార్డులను ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి