Breaking News

9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్‌‌


Published on: 07 Oct 2025 17:57  IST

ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్‌‌కి పిలుపునిచ్చినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఛలో బస్ భవన్ ధర్నాలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సహా.. బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని తెలిపారు. నందినగర్ నుంచి కేటీఆర్.. మెహిదీపట్నం నుంచి హరీశ్‌రావు బస్సులో ప్రయాణం చేసి బస్ భవన్‌కి చేరుకుంటారని చెప్పుకొచ్చారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

Follow us on , &

ఇవీ చదవండి