Breaking News

హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..


Published on: 07 Oct 2025 19:06  IST

భాగ్యనగరంలో పోలీసులు ఇవాళ(మంగళవారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో లింగంపల్లిలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 45 కేజీల గంజాయి పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. ట్రైన్‌లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కి గంజాయిని తరలిస్తోంది ఓ ముఠా.పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. సుమారు రూ. 24లక్షలు విలువ చేసే 45 కేజీల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి