Breaking News

ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే


Published on: 09 Oct 2025 18:20  IST

తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9 అమలుపై కోర్టు మధ్యంతర స్థాయిలో స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లు వేసిన తర్వాత.. అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి