Breaking News

హైద‌రాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం


Published on: 09 Oct 2025 18:39  IST

జీడిమెట్ల ప‌రిధిలోని సుచిత్రా క్రాస్ రోడ్స్ స‌మీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాల‌నీలో సాయిద‌త్తా రెసిడెన్సీలో డ్ర‌గ్స్ త‌యారు చేస్తున్న‌ట్లు ఈగ‌ల్ టీమ్‌కు విశ్వ‌స‌నీయ స‌మాచారం అందింది. దీంతో ఈగ‌ల్ టీమ్ అక్క‌డ దాడులు నిర్వ‌హించి.. 220 కిలోల డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ప‌ట్టుబ‌డ్డ డ్ర‌గ్ విలువ రూ. 10 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. అదే అంత‌ర్జాతీయ మార్కెట్‌లో అయితే రూ. 70 కోట్లు విలువ చేస్తుంద‌న్నారు.వీరంతా ఏపీ చెందిన వార‌ని పోలీసులు తేల్చారు.

Follow us on , &

ఇవీ చదవండి