Breaking News

హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..


Published on: 10 Oct 2025 16:23  IST

నగర సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రియల్ ఎస్టేట్ వేగంగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు. నరెడ్కో 15వ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలను బిల్డర్లు దృష్టిలో పెట్టుకోవాలని భట్టి సూచించారు. భవిష్యత్తులో నగరంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులే ఉంటాయని చెప్పారు. ప్రతి సంవత్సరం నగర అభివృద్ధికి ప్రణాళిక వ్యయంలో భాగంగా బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి