Breaking News

రూ. 16.5 ల‌క్ష‌ల విలువ చేసే గంజాయి స్వాధీనం


Published on: 10 Oct 2025 18:56  IST

బేగంపేట రైల్వే స్టేష‌న్‌లో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. హైద‌రాబాద్ జీఆర్పీ, ఈగ‌ల్ టీమ్, ఆర్పీఎఫ్ సిబ్బంది క‌లిసి బేగంపేట రైల్వే స్టేష‌న్‌లో గుర‌వారం రాత్రి విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు.ఒడిశా నుంచి ముంబైకి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్ద‌రి నుంచి రూ. 16.5 ల‌క్ష‌ల విలువ చేసే 33.05 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్ద‌రిని రాజేశ్ బిషోయ్‌(26), సుజాత సింగ్‌(29)గా పోలీసులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి