Breaking News

కర్నూల్‌కు ప్రధాని మోదీ రాక..


Published on: 13 Oct 2025 14:02  IST

టూరిజం కారిడార్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రధాని మోదీ వస్తున్నందున చాలా అంచనాలున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాటి రాజధాని కర్నూలుపై ప్రధాని మోదీకి అవగాహన ఉంటుందని చెప్పారు. కర్నూలుకి మోదీ వరం ఇస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. GST తగ్గింపుతో ప్రజలకు చాలా మేలు జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనను ప్రజలు విజయవంతం చేయాలని మంత్రి టీజీ భరత్ కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి