Breaking News

నామినేషన్ వేయనున్న సునీత


Published on: 14 Oct 2025 14:01  IST

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలవడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఇక జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రేపు (బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య నామినేషన్ వేస్తారు. అయితే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం నలుగురితో కలిసి నామినేషన్ వేయాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి