Breaking News

అసమర్థపాలన కు స్వస్తి పలకాలి


Published on: 14 Oct 2025 17:38  IST

అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ అభివృద్ధి బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ మైనార్టీ విభాగం ఇన్‌చార్జి షేక్‌ ముక్తార్‌పాషా, నార్సింగి మున్సిపల్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి నేతృత్వంలో సోమవారం కాంగ్రెస్‌, ఎంఐఎం తదితర పార్టీల నుంచి వంద మంది మహిళలు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సబితారెడ్డి, నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Follow us on , &

ఇవీ చదవండి