Breaking News

సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్‌కు షాక్


Published on: 16 Oct 2025 15:15  IST

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి