Breaking News

హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్


Published on: 16 Oct 2025 15:21  IST

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, పలు యూట్యూబ్ నిర్వాహకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. వ్యూస్ కోసం మైనర్లతో వీడియోలు తీయడంపై సీపీ ఫైర్ అయ్యారు. వైరల్ హబ్ యూట్యూబ్ ఛానల్‌లో మైనర్స్ ఇంటర్వ్యూని ఉద్దేశిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. వ్యూస్ మాయలో పడి విలువలు మర్చిపోతే ఎలా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించిన హైదరాబాద్ సీపీ... సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తును నాశనం చెయ్యొద్దంటూ హెచ్చరిక జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి