Breaking News

ఆక్ర‌మ‌ణ‌ల పర్వానికి హైడ్రా ఫుల్‌స్టాప్..


Published on: 17 Oct 2025 14:43  IST

హైదరాబాద్ మహాన‌గ‌రం న‌డిబొడ్డున ఆక్ర‌మ‌ణ‌ల పర్వానికి హైడ్రా ఫుల్‌స్టాప్ పెట్టింది. సిటీలోని గోషామహల్ నియోజకవర్గం కుల్సుంపురాలో క‌బ్జాల‌ను తొల‌గించింది. రూ.110 కోట్ల విలువైన 1.30 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం చేసుకుంది. ప్రజావసరాలకు ఈ భూమిని వినియోగించాలని భావించిన ప్రభుత్వం.. డబుల్ బెడ్ రూం ఇళ్లకు ప్రతిపాదనలు చేస్తోంది.కుల్సుంపురలో ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైదరాబాద్ కలెక్టర్ హైడ్రాను కోరారు. ప్రజావసరాల కోసం వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి