Breaking News

అమీన్ పీర్ దర్గా ఉత్సవాలు..చంద్రబాబుకు ఆహ్వానం


Published on: 18 Oct 2025 17:04  IST

అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ముఖ్యమంత్రిని కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ హరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు.సీఎం కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి