Breaking News

హోంమంత్రి పేరుతో బురిడీ..


Published on: 18 Oct 2025 17:34  IST

శ్రీవారి సేవా టిక్కెట్లు ఏర్పాటు చేస్తామని ఓ దళారీ భక్తులను మోసం చేశాడు. ఏకంగా హోంమంత్రి, టీటీడీ ఉద్యోగుల పేరు చెప్పి భక్తులను బురిడీ కొట్టించాడు దళారి అశోక్. ఇతడి మాటలు నమ్మిన భక్తులు బాగానే సమర్పించారు. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా భక్తుల నుంచి దాదాపు 4 లక్షల 10వేల రూపాయలు వరకు వసూలు చేశాడు దళారీ. అయితే డబ్బులు తీసుకున్న వెంటనే ఫోన్ ఆఫ్ చేసి దళారీ పరారయ్యాడు.విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి