Breaking News

బంద్‌ వేళ దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్


Published on: 19 Oct 2025 12:11  IST

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక(బీసీ జేఏసీ) శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ దాదాపుగా ప్రశాంతంగా జరిగినా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందుకు కారణమైన ఎనిమిది మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దాడులకు పాల్పడిన వారిపై నల్లకుంట, కాచిగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి