Breaking News

మహిళా సాధికారత, రక్షణకు సీఎం ప్రాధాన్యం


Published on: 21 Oct 2025 11:09  IST

మహిళా సాధికారత, రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అందులో భాగంగా శక్తి యాప్‌ను తీసుకు వచ్చామన్నారు. అక్టోబర్ 21వ తేదీ మంగళవారం పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ అమర వీరులకు హోం మంత్రి అనిత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి