Breaking News

చెక్ పోస్టులు క్లోజ్ చేపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి


Published on: 22 Oct 2025 17:01  IST

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలిచ్చారు. దీంతో తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు (బుధవారం) సాయంత్రం 5 గంటల్లోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ ఆదేశాలతో తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్​ పోర్ట్ కమిషనర్ ఆకస్మిక, తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి