Breaking News

కరువు నేలలో.. కృష్ణమ్మ పరవళ్లు


Published on: 23 Oct 2025 14:30  IST

కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేస్తున్నారు. ఆ నీరు మండలంలోని మణూరు చెరువుకు చేరడంతో పూర్తిగా నిండిపోయింది. బుధవారం మరువ పోయింది. హరేసముద్రం చెరువుకు కృష్ణాజలాలు చేరుతున్నాయి.మడకశిర ప్రాంతంలోని మరిన్ని చెరువులను నింపనున్నట్లు హంద్రీనీవా అధికారులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి