Breaking News

పండుగ సీజన్‌లో ఎక్కువ ఫోన్లు అమ్మింది ఈ కంపెనీయే..


Published on: 23 Oct 2025 15:13  IST

ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌ మధ్య భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ స్వల్పంగా వృద్ధిని నమోదు చేసింది. ఓమ్డియా నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్స్‌ షిప్‌మెంట్స్‌ 3శాతం పెరిగి 48.4 మిలియన్‌ యూనిట్లకు చేరుకున్నాయి. వీవో ((iQOO మినహా) 9.7 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 20శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఆ తర్వాత శామ్‌సంగ్ 6.8 మిలియన్ యూనిట్లతో (14శాతం), షియోమి, ఒప్పో ఒక్కొక్కటి 6.5 మిలియన్ యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

Follow us on , &

ఇవీ చదవండి