Breaking News

బాలుడి ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి..


Published on: 23 Oct 2025 15:50  IST

మంగళఘాట్‌కు చెందిన విశ్వజీత్ సాహూ మంగళవారం తన తల్లితో కలిసి దక్షిణ కాళీ గుడికి వెళ్లాడు. అయితే, ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో విశ్వజీత్ ఓ పిచ్చి పని చేశాడు. రీల్స్ కోసం వీడియో తీయడానికి రైల్వే ట్రాక్ మీదకు వెళ్లాడు. ఆ ట్రాక్‌పై రైలు వస్తున్నా కూడా పక్కకు వెళ్లకుండా సెల్ఫీ వీడియో తీసుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రైలు అతడ్ని ఢీకొట్టింది. దూరంగా ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి