Breaking News

ఫ్రాన్స్‌లోని మరో మ్యూజియంలో భారీ చోరీ..


Published on: 24 Oct 2025 14:56  IST

ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్‌ మ్యూజియం లూవ్రా లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఫ్రాన్స్‌లోని మరో మ్యూజియం లో దోపిడీ జరిగింది.ఫ్రాన్స్‌లోని ‘ది మైసన్‌ డెస్‌ లుమైరేస్‌’ అనే మ్యూజియంలో ఈ చోరీ జరిగింది. ఈ ఘటనలో 2వేల బంగారు, వెండి నాణేలు అపహరణకు గురయ్యాయి. వీటి విలువ €90,000 గా అంచనా. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. లువ్రా మ్యూజియంలో చోరీ జరిగిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి