Breaking News

హైదరాబాద్‌లో ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’


Published on: 06 May 2025 19:04  IST

హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా బుధవారం (మే 7న) ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ పేరుతో డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నగరమంతా సైనర్ల మోత మోగనుంది. సైరన్‌ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. సాయంత్రం 4.15 గంటలకు నగరంలోని నాలుగు చోట్ల (సికింద్రాబాద్‌, గోల్కొండ, కంచన్‌బాగ్‌ డీఆర్‌డీవో, మౌలాలి ఎన్‌ఎఫ్‌సీలో) మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి