Breaking News

విమానాన్ని ఢీకొన్న పక్షి.. తప్పిన ప్రమాదం


Published on: 24 Nov 2025 14:00  IST

ఇండిగో(IndiGo) విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబయి(Mumbai) నుంచి డెహ్రాడూన్‌(Dehradun)కు బయల్దేరిన ఇండిగో 6E5032 విమానాన్ని మార్గం మధ్యలో ఆకస్మాత్తుగా ఓ పక్షి ఢీకొంది(Bird Hit). అప్రమత్తమైన పైలట్.. వెంటనే విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ క్రమంలో విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే.. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఇండిగో సంస్థ అధికార ప్రతినిధి ఒకరు అధికారికంగా వెల్లడించారు

Follow us on , &

ఇవీ చదవండి