Breaking News

అసెంబ్లీలో నేనే సీనియర్..


Published on: 25 Nov 2025 18:22  IST

రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకేపార్టీ నుంచి వరుసగా ఏడు సార్లు గెలిచానని గుర్తు చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత తానే సీనియర్ అని చెప్పారు. అయితే కేసీఆర్ వివిధ పార్టీల నుంచి గెలిచారని.. అలాగే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయారని గుర్తు చేశారు. తాను మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదని చెప్పారు. సూర్యపేట DCC పదవి తమకు ఇస్తామన్నారని, అయితే తామే ఆ పదవిని వద్దనుకున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి