Breaking News

ఇండస్ట్రీయల్ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదు


Published on: 27 Nov 2025 16:46  IST

ఇండస్ట్రీయల్ పాలసీ పై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొల్యూషన్ ఫ్రీగా చేయడమే తమ ప్రభుత్వ పాలసీ లక్ష్యమని వ్యాఖ్యానించారు.ఈ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమే లేదని స్పష్టం చేశారు.తమ ప్రభుత్వం తెచ్చింది పారదర్శక మైన పాలసీ అని చెప్పుకొచ్చారు.ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.ప్రతిపక్షాల నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.

Follow us on , &

ఇవీ చదవండి