Breaking News

ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన శాంసంగ్‌..


Published on: 02 Dec 2025 14:20  IST

ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీదారు శాంసంగ్ మ‌రో అద్భుతమైన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్‌ను సైలెంట్‌గా రిలీజ్ చేసింది. గెలాక్సీ జ‌డ్ ట్రై ఫోల్డ్ పేరిట కంపెనీకి చెందిన తొలి ట్రై ఫోల్డ్ స్మార్ట్ ఫోన్‌ను ద‌క్షిణ కొరియా మార్కెట్‌లో తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ మ‌ల్టీ ఫోల్డింగ్ ఫామ్ ఫ్యాక్ట‌ర్‌ను క‌లిగి ఉండ‌డం విశేషం. ఏకంగా మూడు సార్లు ఈ ఫోన్‌ను మ‌డ‌త‌బెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుక‌నే ఈ ఫోన్‌కు ట్రై ఫోల్డ్‌గా నామ‌క‌ర‌ణం చేసి రిలీజ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి