Breaking News

వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌..


Published on: 02 Dec 2025 16:05  IST

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మూడు రోజులకు సంబంధించిన ఆన్‌లైన్‌ ఈ-డిప్‌లో  ఎంపికైన భక్తుల వివరాలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. గత నెల 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 9,55,703 రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తుల వివరాలు సమర్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement