Breaking News

రోహింగ్యాలకు రెడ్‌కార్పెట్ పరవాలా..సుప్రీం సీరియస్


Published on: 02 Dec 2025 18:20  IST

ఐదుగురు రోహింగ్యాలు కస్టడీ నుంచి అదృశ్యమయ్యారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమ వలసదారులకు దేశం 'రెడ్ కార్పెట్' పరవాలని మీ ఉద్దేశమా అని పిటిషనర్‌ను సూటిగా ప్రశ్నించింది. భారతదేశంలో కూడా పేదప్రజలు ఉన్నారని, వారు ఈ దేశ పౌరులని, వారికి నిర్దిష్ట ప్రయోజనాలు, సౌకర్యాలు అవసరం లేదనుకుంటున్నారా? వాళ్లపై ఎందుకు దృష్టి సారించరు? అని పిటిషనర్‌ను సీజేఐ ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి