Breaking News

సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం..


Published on: 09 May 2025 15:13  IST

భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ మీడియా, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు తెరలేపాయి.మహ్మద్ అలీ రెజా రజు అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ‘ బ్రేకింగ్ .. ఇండియాలోని జమ్మూ ఎయిర్ బేస్‌లో చాలా చోట్ల ప్రభావం పడ్డట్టు తేలింది’ అని రాసుకొచ్చాడు. దానిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ వీడియో 2021, కాబూల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించినదని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి