Breaking News

ఐ బొమ్మ రవి కేసు.. బెయిల్ వస్తుందా?


Published on: 04 Dec 2025 17:53  IST

ఐ బొమ్మ రవి కస్టడీ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు(శుక్రవారం) తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. ఐ బొమ్మ రవి నుంచి కీలక సమాచారాన్ని ఇంకా సేకరించాల్సి ఉందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రవి బెయిల్ పిటిషన్‌‌పై కూడా వాదనలు కొనసాగాయి. కేసు విచారణ దశలో బెయిల్ మంజూరు చేయవద్దంటూ పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. 4 కేసుల్లో వేర్వేరుగా విచారణ చేపట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి