Breaking News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు


Published on: 05 Dec 2025 14:58  IST

హిల్ట్ పాలసీపై (Hilt Policy) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఇవాళ (శుక్రవారం) విచారణ జరిగింది. హిల్ట్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పిటిషన్లు దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టుకు ఆయన తెలిపారు. దీనిపై సీబీఐ లేదా ఈడీ దర్యాప్తు చేయించాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.ఇప్పటివరకు ఉన్న రికార్డులను సీజ్‌ చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించాలని కోర్టుకు విన్నవించారు.

Follow us on , &

ఇవీ చదవండి