Breaking News

ఆలయ ప్రసాదంలో పాము పిల్ల


Published on: 09 May 2025 18:36  IST

ఆలయ ప్రసాదంలో పాము పిల్ల రావడంతో యాత్రికుల్లో కలవరం రేగింది. హోసూరు కార్పొరేషన్‌ పరిధిలో కొండమీద ఉన్న ప్రసిద్ధ మరగతాంబ సమేత శ్రీ చంద్రచూడేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దేవదాయశాఖ ప్రసాదాల దుకాణం ఉంది. మంగళవారం ఓ యాత్రికుడు పులిహోర ప్రసాదం డబ్బా కొని తెరిచి చూడగానే, అందులో చచ్చిన పాము పిల్ల కనిపించడంతో షాకయ్యాడు. దీంతో యాత్రికులందరిలో కలవరం రేగింది. అంతా కలిసి దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి